షాదీ డాట్ కామ్‌తో సైబర్ మోసాలు: సుప్రీంకోర్టు ఆగ్రహం

షాదీ డాట్ కామ్ వెబ్‌సైట్ ద్వారా యానాం ఎమ్మెల్యే ఫోటోతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి, యువతులను మోసం చేసిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వెబ్‌సైట్ సైబర్ నేరగాళ్లకు మార్గాన్ని సులువుగా చేసిందని కోర్టు పేర్కొంది. రాజమండ్రికి చెందిన చెరుకూరి హర్ష అనే వ్యక్తి, ఒక వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.11 లక్షలు దోచుకున్నాడు. ఇదే తరహాలో పలువురు యువతులు ఫిర్యాదు చేయడంతో నిందితుడితో పాటు షాదీ డాట్ కామ్ డైరెక్టర్, టీమ్ లీడర్, మేనేజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును పునఃసమీక్షించుకోవాలని తెలంగాణ హైకోర్టును ఆదేశిస్తూ సుప్రీంకోర్టు విచారణ ముగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్