టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. సంస్థ ఎండీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు.. అర్హులైన క్లాస్ 3, క్లాస్ 4 స్థాయి ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ అడ్వాన్స్ మొత్తాన్ని అనుబంధ వేతన బిల్లు ద్వారా వెంటనే చెల్లించాలని అధికారులకు సూచించారు. తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా, 10 సమాన వాయిదాల (EMI) పద్ధతిలో ఉద్యోగుల వేతనాల నుండి తిరిగి రికవరీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕