గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు భారత్ తొందరపడదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఉన్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నయి. ‘ఇరు పక్షాలకు లబ్ధి చేకూరేలా ఒప్పందం ఉండాలి. అది దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి. అలా అయితే అభివృద్ధి చెందిన దేశాలతో చర్చలకు భారత్ సిద్ధంగా ఉంటుంది’ అని అన్నారు.