ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెలీలను చంపినట్లు రుజువైన పాలస్తీనియన్లకు ఉరిశిక్ష విధించే 'మరణశిక్ష చట్టాన్ని' ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్) ఆమోదించింది. ఈ చట్టంపై మానవ హక్కుల సంఘాలు, పాలస్తీనా నాయకులు, ఐక్యరాజ్యసమితి, ఐరోపా దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది వివక్షతో కూడుకున్నదని, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, మానవ హక్కుల ఉల్లంఘన అని విమర్శిస్తున్నాయి. ఇజ్రాయెల్ మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ మాత్రం ఐరోపా దేశాల బెదిరింపులకు భయపడబోమని, చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు.