16న కేరళ నర్సుకు మరణశిక్ష.. స్పందించిన సుప్రీం

యెమెన్‌లో వ్యాపారి హత్య కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు ఈనెల 16న ఉరిశిక్ష అమలుకానున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై నమోదైన పిటిషన్‌ విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై తదుపరి విచారణ ఈనెల 14న ఉండనున్నట్లు తెలిపింది. 16న మరణశిక్ష అమలు నేపథ్యంలో దౌత్య చర్చలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుందని, అది ప్రభావం చూపకపోవచ్చని సీనియర్‌ న్యాయవాది రాజేంత్‌ బసంత్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్