TG: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి 11 కొత్త అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ మూడేళ్ల కోర్సుల్లో చివరి ఏడాది విద్యార్థులు కంపెనీల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందుతూ నెలకు రూ.7 వేల స్టైపెండ్ అందుకుంటారు. ఈ ఏడాది మొత్తం సీట్లను 11 వేలకు పెంచి, కనీసం 8 వేల సీట్లను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు, విద్యార్థులకు సంప్రదాయ విద్యతో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా ఉద్యోగ శిక్షణ ఇచ్చేందుకు ఈ చర్యలు చేపట్టారు.