TG: ఏజెన్సీ చట్టాలు అమలులో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 1970కు ముందు నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు ఆధారాలు చూపినా ఫలితం దక్కడం లేదు. దీనిపై ప్రభుత్వ స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల జరిగిన సమీక్షలో స్పష్టం చేశారు. నోటీసులు కూడా జారీ చేయడం లేదని సమాచారం.