సీజేపీ నాయకులకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసన తెలపడం, జాతీయ జెండాను ఎగరవేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణల కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోశ్ రంకా, జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జి అజింక్య షిండేలకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విడుదలైన మరుసటి రోజే వీరికి సమన్లు అందాయి. నిందితులు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాజౌరీ గార్డెన్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.