కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ సమన్లకు హాజరుకాకపోవడంతో ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టి కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు రికార్డులను సమర్పించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్