2019 ఏప్రిల్‌కు ముందు రిజిస్ట్రేషన్ అయిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, వాహన దొంగతనాలను తగ్గించడం దీని లక్ష్యం. www.siam.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనాలకు రూ.320-500, నాలుగు చక్రాల వాహనాలకు రూ.600-3000 వరకు ధరలు ఉన్నాయి. ఈ ప్లేట్లలో యూనిక్ లేజర్ ఐడీ, క్రోమియం హోలోగ్రామ్, నాన్-రిమూవబుల్ స్నాప్ లాక్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి ట్రాకింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటాయి.