బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించే పన్ను.. ఎన్నికోట్లో తెలుసా?

ముంబైలో జరిగిన BCCI 95వ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక విషయాలు వెల్లడించారు. BCCI ఏటా సుమారు రూ.3,000 కోట్ల ఆదాయపు పన్ను చెల్లిస్తోందని తెలిపారు. నేషనల్‌ స్పోర్ట్స్‌ గవర్నెన్స్‌ యాక్ట్‌ పరిధిలోకి రావడంపై సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో.. BCCI తన వైఖరిపై అక్టోబర్‌ 27న స్పష్టత ఇవ్వనున్నట్లు సైకియా చెప్పారు. అయితే పన్నుల వివరాలకు స్పోర్ట్స్‌ యాక్ట్‌ అంశానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕