తేలు ఆరు రోజులు శ్వాస తీసుకోకుండా జీవించగలదట. తేలు ఊపిరితిత్తులు పుస్తకపు పేజీల తరహాలో ముడుచుకొని ఉంటాయి. దీని కారణంగా ఆక్సిజన్ అందనప్పుడు ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న గాలితో జీవించగలదు. తేలు ఆహారం లేకుండా ఏడాది పాటు జీవించగలదు. నీటిని చాలా తక్కువగా తీసుకుంటుంది. రెడ్ స్కార్పియన్ తేలు కుడితే 72 గంటలలోపు చికిత్స తీసుకోవాలి. లేకపోతే మరణం సంభవించడం ఖాయం. ఈ తేలు భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లో కనిపిస్తుంది.