డిజిటల్‌గా జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం 2027లో జరగనున్న జనగణనను డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నట్లు లోక్సభలో వెల్లడించింది. మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరణతో పాటు, ప్రజలు వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు అందించే అవకాశం కల్పిస్తామని తెలిపింది. ప్రస్తుతం నివసిస్తున్న చోటే ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తామని, జన్మించిన ప్రాంతం, గతంలో నివసించిన చోటు నుంచి కూడా డేటా తీసుకుంటామని, వలసలకు కారణాలను కూడా తెలుసుకుంటామని ప్రభుత్వం వివరించింది. జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది.

సంబంధిత పోస్ట్