టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి రూట్వేవ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో హయత్నగర్-2 డిపోకు చెందిన 10 ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించింది. ఈ స్క్రీన్ల ద్వారా మెట్రో తరహాలో తదుపరి బస్ స్టాప్ వివరాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రదర్శిస్తారు. వాణిజ్య ప్రకటనల ద్వారా టికెటేతర ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా మిగతా బస్సులకూ విస్తరిస్తారు.