పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్‌.. పోలీసుల క్లారిటీ

తెలంగాణలో పెండింగ్‌ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్ ఇస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారంపై పోలీసులు స్పష్టతనిచ్చారు. ఈ ప్రచారంలో నిజం లేదని.. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ట్రాఫిక్ అదనపు సీపీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పెండింగ్‌ చలాన్లపై ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదని తెలిపారు. పెండింగ్‌ చలాన్లకు సంబంధించి అధికారిక సమాచారం ఏదైనా పోలీసు శాఖ వెబ్‌సైట్‌ echallan.tspolice.gov.in ద్వారా వెల్లడిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్