తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణను అనేక సంవత్సరాలుగా టీటీడీ అమలు చేస్తోంది. ఇకపై అనుబంధ ఆలయాల్లోనూ నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 60 అనుబంధ ఆలయాల్లో అన్నప్రసాద వితరణను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. వీటిలో 12 ఆలయాల్లో ఇప్పటికే వితరణ జరుగుతోంది. వచ్చే మార్చికల్లా అన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.