హైదరాబాద్‌లో రేషన్ కార్డుల పంపిణీ శుక్రవారం ప్రారంభమవుతుంది. మూడు రోజుల్లో 55,378 కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. కొత్తగా పంపిణీ చేయనున్న 55,378 కార్డులతో 2,01,116 మంది లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. పాత కార్డులలో అర్హులను చేర్చడంతో 2,32,297 మందికి లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ ప్రాంతాల్లో పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందించనున్నారు.