ఈ నెల 5 వరకు రేషన్ బియ్యం పంపిణీ

TG: పౌరసరఫరాల శాఖ రేషన్ బియ్యం పంపిణీ గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించింది. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్‌ను ఆగస్టు 31 వరకు ఒకేసారి పంపిణీ చేయాలని మొదట ప్రకటించారు. అయితే, రద్దీ, రాఖీ పండుగ నేపథ్యంలో కొందరు సొంతూళ్లకు వెళ్లడం వల్ల రేషన్ తీసుకోలేకపోయారు. దీంతో, లబ్ధిదారుల సౌలభ్యం కోసం గడువును పొడిగించారు. 5వ తేదీ సాయంత్రం వరకు రేషన్ పంపిణీ కొనసాగుతుందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్