ATM ఆవిష్కరణకు ప్రేరణ జాన్ షెఫర్డ్ బారన్‌కు లండన్‌లో ఓ బ్యాంకు వద్ద ఎదురైన అనుభవంతో వచ్చింది. డబ్బు కోసం క్యూలో నిలబడిన సమయంలో తనకూ ఇబ్బందులు ఎదురవటంతో, బ్యాంకు వద్ద గంటల తరబడి ఉండకుండా డబ్బు తీయడానికి మార్గం ఆలోచించారు. అప్పట్లో చాక్లెట్ వెండింగ్ మెషీన్ చూసి, అదే తత్వంతో డబ్బులు వచ్చేలా చేయాలని భావించి ATMను రూపొందించారు. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉంది.