వ‌ర్షాకాలంలో ప‌ట్టాల‌పై రైలు జార‌కుండా ఎలా ఉంటుందో తెలుసా?

వర్షాకాలంలో రైలు పట్టాలు జారుడుగా మారినప్పుడు చక్రాలు జారకుండా ఉండటానికి ఇంజిన్‌లో ఇసుక డబ్బాలు ఉంటాయి. చక్రాలు జారుతున్నట్లు గమనిస్తే, లోకో పైలట్ లేదా ఆటోమేటిక్ సిస్టమ్ చక్రాల ముందుకు ఇసుకను జల్లుతుంది. పట్టాలపై పడిన ఇసుక వల్ల చక్రాలకు, పట్టాలకు మధ్య ఘర్షణ పెరిగి రైలు సులభంగా పట్టును సాధిస్తుంది. వందే భారత్ వంటి ఆధునిక రైళ్లలో ప్రమాదాలు జరగకుండా వేగాన్ని నియంత్రించే ఆటోమేటిక్ ఇసుక స్ప్రే సిస్టమ్స్ కూడా ఉంటాయి.

సంబంధిత పోస్ట్

✕
✕