మహాత్మా గాంధీజీ అసలు పేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ. ఆయన అక్టోబర్ 2, 1869న గుజరాత్‌లోని పోర్బందర్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయి. ప్రజలు ఆయనను ప్రేమగా 'బాపూజీ' అని పిలుచుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకు 'మహాత్మా' అనే బిరుదును ఇచ్చారు. మనం ఆయనను 'జాతిపిత'గా గౌరవిస్తాము.