తొలి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?

సాంకేతికత అందుబాటులోకి రాకముందు ఉత్తరాలు చేరడానికి రోజుల తరబడి పట్టేది. ఈ నిరీక్షణకు తెరదించుతూ, సరిగ్గా 38 ఏళ్ల క్రితం భారత తపాలా శాఖ ఆకాశ మార్గాన 'హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్' ను ప్రారంభించింది. 1988, జనవరి 27న అండమాన్ నికోబార్ దీవులలో పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్‌లాక్ దీవుల మధ్య ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే తొలి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ 1947లో అమెరికాలో ప్రారంభమైంది. సాంకేతికత పెరిగినా, మారుమూల ప్రాంతాల ప్రజలను అనుసంధానించడానికి భారత తపాలా శాఖ చేసిన ఈ ప్రయత్నం స్ఫూర్తిదాయకం.

సంబంధిత పోస్ట్