అత్యంత ప్రమాదకర ‘ఆమ్ల సరస్సు’.. ఎక్కడో తెలుసా?

ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న కవా ఈజెన్ అగ్నిపర్వత బిలం, ప్రపంచంలోనే అత్యంత ఆమ్లత్వం కలిగిన నీటితో సహజ అద్భుతంగా గుర్తించబడింది. దీని నీలిపచ్చటి నీరు, రాత్రిపూట కనిపించే నీలి జ్వాలలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అయితే, ఈ బిలం చుట్టూ విషవాయువులు తిరుగుతుంటాయి, నీరు అత్యంత ఆమ్లత్వం కలిగి ఉండటంతో తాకితే కాలిపోతుంది. ఈ సరస్సు pH స్థాయి 0.3 కంటే తక్కువగా ఉంది, ఇది బ్యాటరీ యాసిడ్​కు సమానం. పర్యాటకులు గ్యాస్ మాస్కులు ధరించడం తప్పనిసరి, బిలం దగ్గర ఎక్కువసేపు ఉండటానికి నిపుణులు అనుమతించరు.

సంబంధిత పోస్ట్