వేసవిలో ఉపశమనం కోసం వాడే ఏసీలు అజాగ్రత్తతో ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంప్రెషర్‌లో ఒత్తిడి పెరగడం, నిరంతరాయ వాడకం, దుమ్ము చేరడం, గ్యాస్ లీకేజీ, వోల్టేజ్ సమస్యలు ఏసీ పేలుళ్లకు కారణమవుతాయి. ప్రమాదాలను నివారించడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించడం, గ్యాస్ లీకేజీ తనిఖీ, ఫిల్టర్లు, కాయిల్స్ శుభ్రంగా ఉంచడం, నాణ్యమైన వైరింగ్ వాడటం, స్టెబిలైజర్ అమర్చడం, ఏసీకి మధ్యమధ్యలో విరామం ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.