బయటి వెలుతురు నుంచి చీకటి గదిలోకి వెళ్ళినప్పుడు కళ్ళు మసకబారడం సహజం. అప్పుడు ఆకుపచ్చ లేదా నీలం రంగు కనిపిస్తే కళ్ళకు ఉపశమనం కలుగుతుంది. అందుకే ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తారు. ఆకుపచ్చ, నీలం రంగులు ఇతర రంగులకు విరుద్ధంగా ఉంటాయి. ఆపరేషన్ సమయంలో సర్జన్ దృష్టి ఎరుపు రంగులపై కేంద్రీకృతమవుతుంది. ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు సర్జన్ దృష్టి సామర్థ్యాన్ని పెంచి, ఎరుపు రంగు ప్రభావాన్ని తగ్గిస్తాయి.