పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ కలర్‌లో ఎందుకు ఉంటాయో తెలుసా?

మార్కెట్లో లభించే పాల ప్యాకెట్ల రంగులు కేవలం ప్యాకేజింగ్‌లో భాగం కాదని, అవి పాలలోని కొవ్వు శాతాన్ని తెలియజేస్తాయని చెబుతున్నారు. ఆరెంజ్ రంగు ప్యాకెట్లు ఫుల్ క్రీమ్ (6% కొవ్వు), గ్రీన్ రంగు ప్యాకెట్లు నార్మల్ ఫ్యాట్ (4.5% కొవ్వు), బ్లూ రంగు ప్యాకెట్లు టోన్డ్ మిల్క్ (3% కొవ్వు), లేత గులాబీ రంగు ప్యాకెట్లు డబుల్ డోన్డ్ మిల్క్ (1.5% కొవ్వు)ను సూచిస్తాయని పేర్కొంటున్నారు. ఈ రంగుల ఆధారంగా వినియోగదారులు తమ అవసరాలకు తగిన పాలను ఎంచుకోవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕