క్యూఆర్‌ కోడ్‌ అసలు ఎందుకు పుట్టిందో తెలుసా?

నేడు డిజిటల్ చెల్లింపులు, మెనూలకు విస్తృతంగా వాడుతున్న 'క్యూఆర్ కోడ్' (QR Code) నిజానికి 1994లో టయోటా కార్ల విడిభాగాలను సులభంగా గుర్తించేందుకు రూపుదిద్దుకుంది. డెన్సో వేవ్ ఇంజినీర్ మసాహిరో హరా సాధారణ బార్‌కోడ్‌ల పరిమితులను అధిగమించేందుకు ఈ టూ-డైమెన్షనల్ కోడ్‌ను రూపొందించారు. దీని మూలల్లో ఉండే 3 చతురస్రాలు ఏ కోణంలోనైనా వేగంగా స్కాన్ చేయడానికి తోడ్పడతాయి. పేటెంట్ రుసుములు లేకపోవడంతో 7,000 పైగా అక్షరాల సామర్థ్యమున్న ఈ సాంకేతికత ప్రపంచమంతటా విస్తరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕