హోటల్ గదుల్లో బెడ్‌కు ఎదురుగా అద్దాలు ఉండటానికి అనేక కారణాలున్నాయి. సహజ కాంతిని ప్రతిబింబించడం ద్వారా గది ప్రకాశవంతంగా మారి విద్యుత్ ఆదా అవుతుంది. చిన్న గదులను కూడా విశాలంగా చూపించేందుకు ఇంటీరియర్ డిజైనర్లు ఈ ట్రిక్‌ను ఉపయోగిస్తారు. భద్రతాపరంగా, వేలి కొనను అద్దంపై పెట్టినప్పుడు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అది ‘టూ-వే మిర్రర్’ అని గుర్తించవచ్చు. అయితే, వాస్తు ప్రకారం బెడ్ ముందు అద్దం ఉండటం ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తుందని నిపుణులు చెబుతుంటారు.