పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్న శ్రీనివాసుడు తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహస్వామి వద్ద కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతమై ఉండేది. దానికి బదులుగా శ్రీనివాసుడు వరాహస్వామికి ఒక వరం ఇచ్చాడు. తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు రావాలని, లేని పక్షంలో వారి తిరుమల యాత్ర అసంపూర్ణమై, శ్రీవారి దర్శన ఫలం కూడా దక్కదని చెప్పాడు శ్రీనివాసుడు.