రోజూ గడపకు పసుపు, కుంకుమ పెడుతున్నారా?

ప్రతి ఇంటి ప్రధాన ద్వారం వద్ద గడపకు పసుపు, కుంకుమ దిద్దడం భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన ఆచారం. దీని వెనుక ఇంటి సుఖశాంతులు, ఆర్థిక శ్రేయస్సు దాగి ఉన్నాయి. బయటి నుండి వచ్చే ప్రతికూల శక్తులు, చెడు దృష్టి ఇంట్లోకి రాకుండా ఇది రక్షా కవచంగా పనిచేస్తుంది. పురాణాల ప్రకారం, ఇంటి గడప లక్ష్మీదేవి నివాస స్థలం. జ్యేష్ఠాదేవి అపరిశుభ్రతకు, దరిద్రానికి ప్రతీక కాగా, లక్ష్మీదేవి పరిశుభ్రతకు, ఐశ్వర్యానికి ప్రీతి పాత్రురాలు. గడప శుభ్రంగా, పసుపు కుంకుమలతో కళకళలాడుతుంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

సంబంధిత పోస్ట్