మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ మంగళవారం ఆసుపత్రిని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎస్‌వోతో సహా నలుగురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.