బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా సహా ప్రభుత్వంలోని మహిళా ఉద్యోగులను ‘సర్’ అని పిలవాలన్న ఆదేశాలను రద్దు చేసింది. అడ్వైజరీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హసీనా ప్రధానిగా ఉన్నంత కాలం ఆమెను ‘మేడం’ అని కాకుండా ‘సర్’ అని పిలవాలని ఆదేశించింది. అయితే ఇలా పిలవడం సామాజికంగా అనుచితమైంది కాదని తాత్కాలిక ప్రభుత్వం అభిప్రాయపడింది. హసీనా జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.