ఇంట్లో ఈ వస్తువులు పెట్టొద్దు!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పగిలిన లేదా చిప్ అయిన అద్దాలు, పాత్రలు, ఆగిపోయిన గడియారాలు, పాడైన ఎలక్ట్రానిక్స్ వంటివి అస్సలు ఉంచకూడదు. ఇవి అదృష్టాన్ని దెబ్బతీసి, ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. పగిలిన అద్దాలు దురదృష్టాన్ని, ఆర్థిక సమస్యలను తెస్తాయని నమ్ముతారు. పనిచేయని గడియారాలు జీవితంలో పురోగతిని అడ్డుకుంటాయని, పాడైన ఎలక్ట్రానిక్స్ ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వీటిని వెంటనే బాగు చేయించడం లేదా ఇంటి నుంచి తొలగించడం మంచిది.

సంబంధిత పోస్ట్

✕
✕