విదేశాల్లో లా చదవాలనుకుంటున్న విద్యార్థులకు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పలు సూచనలు చేశారు. నిజంగా చదువు పట్ల ఆసక్తి ఉంటేనే విదేశాలకు వెళ్లాలని, ఒత్తిడితో వెళ్లడం తగదన్నారు. కొందరు లక్షల రూపాయల అప్పు చేసి విదేశాల్లో లా డిగ్రీలు చేస్తున్నారని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ డిగ్రీలు విలువను పెంచుతాయని అనుకోవద్దని, నిజమైన విలువ కష్టపడి చదివి సాధించినప్పుడే వస్తుందని స్పష్టం చేశారు.