అడుక్కుంటూ సీఎం సహాయనిధికి లక్షలాది రూపాయల డొనేషన్

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళంకు చెందిన 75 ఏళ్ల పూల్‌పాండియన్‌, భిక్షాటన ద్వారా సంపాదించిన సొమ్మును సీఎం సహాయ నిధికి విరాళంగా అందిస్తున్నారు. గతంలో ముంబైలో ఉద్యోగం చేసిన ఆయన, భార్య మృతి తర్వాత తమిళనాడుకు వచ్చి భిక్షాటన చేస్తున్నారు. ఇప్పటివరకు సహాయనిధికి లక్షలాది రూపాయలు అందించిన ఆయన, ఈ నెల 18, 25 తేదీల్లో మదురై కలెక్టర్‌కు రూ.10 వేల చొప్పున అందించారు. కరోనా సమయంలోనూ రూ.50 వేలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్