కేంద్ర ప్రభుత్వం ఆధార్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఆధార్ దుర్వినియోగం కాకుండా, సురక్షితంగా, సులభతరంగా ఉపయోగించుకునేందుకు ఈ యాప్ రూపొందించబడింది. ఈ యాప్‌లో మొబైల్, అడ్రస్ అప్‌డేట్ చేసుకునే సౌలభ్యంతో పాటు, పేపర్ లెస్ విధానంలో డిజిటల్ ఆధార్‌ను ఉపయోగించుకోవచ్చు. బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. ఇతరులతో పంచుకునే వివరాలను మీరే ఎంచుకోవచ్చు. గతంలో ప్రవేశపెట్టిన మస్క్‌డ్ ఆధార్ కార్డులను కూడా ఈ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మస్క్‌డ్ ఆధార్‌లో ఆధార్ నెంబర్‌లోని కేవలం నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి, మిగతావి మాస్క్ చేయబడి ఉంటాయి.