ఐసీఏఆర్ – భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరావును ప్రతిష్టాత్మక 'ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్' జాతీయ అవార్డు (2024–25)కు ఎంపిక చేశారు. భారత ఆహార భద్రత కోసం విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు గుర్తింపుగా నుజివీడు సీడ్స్ లిమిటెడ్ సహకారంతో 2004-05లో ఈ అవార్డును ప్రకటించారు. డా.ఎం.ఎస్.స్వామినాథన్ జన్మ శతాబ్ది సంవత్సరంలో ఈ అవార్డును ప్రకటించడం విశేషం.