భారతదేశంలోకి పాకిస్థాన్ నుంచి ఎండుఖర్జూరం దిగుమతిని డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. యూఏఈ నుంచి దిగుమతి చేసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించిన వ్యాపారుల నుంచి రూ.3 కోట్ల విలువైన 364 మిలియన్ టన్నుల ఎండు ఖర్జూరాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాండ్లా పోర్టుకు తరలిస్తున్న 13 కంటైనర్లను అధికారులు తనిఖీ చేశారు. గతంలోనే పాకిస్థాన్ నుంచి అన్ని రకాల ఉత్పత్తుల దిగుమతిని భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే.