సింగరేణి అధికారులకు దసరా కానుక

సింగరేణి అధికారులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. కోలిండియా తరహాలో వేతనాల పెంపునకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 1 నుంచి 7 వరకు ఉన్న సుమారు 1,800 మంది అధికారులకు లబ్ధి చేకూరనుంది. ఈ వేతన సవరణకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు సెప్టెంబర్ 25వ తేదీ నుండి వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕