దసరా స్పెషల్.. ఉద్యోగులకు బోనస్ ప్రకటన

స్వర్ణోత్సవ సంబరాలు, దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని కోలిండియా లిమిటెడ్ యాజమాన్యం తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సబ్సిడరీలు, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని (PLR) ప్రకటించింది. కార్మికుల పనితీరుకు గుర్తింపుగా కోలిండియా, సబ్సిడరీలకు చెందిన 2.09 లక్షల మంది కార్మికులకు, సింగరేణికి చెందిన 38 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,03,000 చొప్పున బోనస్ ప్రకటించింది .

సంబంధిత పోస్ట్