ఓట్ల చోరీ.. రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన ఈసీ

ఈసీ ఓట్లను చోరీ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చౌర్యం జరిగిందన్న రాహుల్ వ్యాఖ్యలపై శుక్రవారం ఈసీ స్పందించింది. విపక్షాల నిరాధార ఆరోపణలను ఖండించింది. బెదిరింపులను, బాధ్యతారహిత వ్యాఖ్యలను పట్టించుకోబోమని స్పష్టం చేసింది. పారదర్శకంగా పనిచేస్తూనే ఆరోపణలను విస్మరించాలని అధికారులకు ఈసీ సూచించింది.

సంబంధిత పోస్ట్