తెలంగాణ ఓటర్లకు ECI శుభవార్త.. నవంబర్ 9 తర్వాత ప్రత్యేక నమోదు డ్రైవ్!

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓటర్లకు ఉపశమనం కలిగించేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. కారణాలు లేకుండా 2 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించడం, బల్క్ డిలీషన్లపై స్పందిస్తూ.. ముందస్తు నోటీసు, స్పష్టమైన ఆధారాలు లేకుండా ఏ ఓటరు పేరునూ తొలగించరాదని ECI స్పష్టం చేసింది. నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదలైన వెంటనే ప్రత్యేక డ్రైవ్ మొదలవుతుంది. బూత్ లెవల్ అధికారులు (BLO) నేరుగా ఇళ్లకు వచ్చి, అర్హులైన కొత్త ఓటర్ల నుంచి ఫారమ్-6 స్వీకరించి ఓటు నమోదు చేస్తారు.

సంబంధిత పోస్ట్

✕
✕