పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి ఏడేళ్లు పూర్తికావడంతో జమ్మూకశ్మీర్, శ్రీనగర్‌లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న సైనికుల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. పుల్వామా జిల్లాలోని లేథిపూర–ఆవంతిపురా సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కాన్వాయ్‌లోకి దూసుకెళ్లి ఢీకొట్టింది. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందగా, ఒక ఉగ్రవాది మృతి చెందాడు.