ఎల్‌నినో ఎఫెక్ట్.. అమ్మకానికి బావి, చెరువు నీళ్లు

TG: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామంలో ఎల్‌నినో ప్రభావంతో చెరువు, ఊరబావి నీటిని వేలం వేసి అమ్ముతుండటం తీవ్ర వివాదాస్పదమైంది. నల్లచెరువులో చేపల పెంపకం వేలం దక్కించుకున్న వారు, నీటిని సాగుకు వాడుకుంటున్న రైతుల నుండి ఒక్కో మోటారుకు రూ.7,000 వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నీటి విక్రయాలను అడ్డుకుని తమకు సాగునీరు అందించాలని కోరుతూ బాధిత రైతులు జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕