ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో నిర్దేశించిన అర్హతలను పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తక్కువ అర్హతలతో కూడిన ఉద్యోగాలకు ఎక్కువ చదువుకున్న వారిని ఎంపిక చేయడం అర్హులైన వారికి అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించింది. ఒక బ్యాంకు ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును రద్దు చేస్తూ, గ్రాడ్యుయేట్ అయిన విషయాన్ని దాచిపెట్టి, పదో తరగతి అర్హత గల పోస్టులో చేరినట్లు పేర్కొంది.