తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్

పోరాడి సాధించుకొని.. పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జిల్లాల్లో పోలీస్ యాక్ట్ అమలు వార్త కథనాన్ని ట్వీట్ కు జోడించారు. ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎనుకటి కాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు.. హక్కులను అడిగితే బెదిరింపులు అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్