ఈపీఎఫ్ కనీస వేతన పరిమితి పెంపు.. ఉద్యోగులకు శుభవార్త!

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ కనీస వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే యోచనలో ఉంది. ఈ ప్రతిపాదనపై ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 12 ఏళ్లుగా మార్పులు లేని ఈ పరిమితి పెంపుతో లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్, పెన్షన్ సౌకర్యం పొందనున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తే, కోటి మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు. దీనివల్ల చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినా, దీర్ఘకాలంలో అధిక నిధులు, పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్