ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు జులై 2 వరకు బంద్

భారీ డేటాబేస్ విలీనం, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ పనుల కారణంగా EPFO తన ఆన్‌లైన్ సేవలను జులై 2 అర్ధరాత్రి వరకు నిలిపివేసింది. ఈ నిర్వహణ పనులు జులై 1 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో సభ్యులు పీఎఫ్ విత్‌డ్రాయల్, క్లెయిమ్ స్టేటస్, పాస్‌బుక్ చూడడం వంటి సేవలను వినియోగించలేరు. యజమానులు కూడా పరిపాలనా పనులు పూర్తి చేయలేరు. క్లెయిమ్ ప్రాసెసింగ్ వ్యవస్థను ఆధునీకరించడం, సేవలను వేగంగా, సురక్షితంగా అందించడమే ఈ అప్‌గ్రేడ్ ఉద్దేశ్యం. ఏవైనా సహాయం అవసరమైతే 14470 హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్