పీఎఫ్ ఖాతాదారులకు ఈ-నామినేషన్ తప్పనిసరి: కేంద్రం

పీఎఫ్ ఖాతాదారులకు ఈ-నామినేషన్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇది తప్పనిసరి కానప్పటికీ, ఇప్పుడు ఖచ్చితంగా నామినీ వివరాలను నమోదు చేయాలి. లేకపోతే ఆన్‌లైన్ పీఎఫ్ సేవలు పొందడం సాధ్యం కాదు. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే, వారి కుటుంబసభ్యులకు నిధులు అందజేయడానికి నామినీ అవసరం. ఈపీఎఫ్‌వో రూ.7 లక్షల జీవిత బీమా కూడా అందిస్తుంది. నామినీ వివరాలు లేకపోతే, నగదు క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ-నామినేషన్ ప్రక్రియను ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో సులువుగా పూర్తి చేయవచ్చు.

సంబంధిత పోస్ట్