ఉద్యోగాలు మారే సమయంలో పీఎఫ్ ఖాతాలో జాయినింగ్, ఎగ్జిట్ తేదీలను సరిచూసుకోవాలని EPFO కోట్లాది మంది ఖాతాదారులకు సూచించింది. ఈ తేదీల్లో పొరపాట్లుంటే పీఎఫ్ క్లెయిమ్స్ తిరస్కరణ, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌లో ఆలస్యం, సర్వీస్ కాలం తప్పుగా నమోదై పెన్షన్ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తప్పులను EPFO వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే సరిచేసుకోవచ్చు. కంపెనీ మూసివేసినా లేదా యజమాని స్పందించకపోయినా, జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ ద్వారా EPFO కార్యాలయంలో సంప్రదించి వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా యూఏఎన్ పోర్టల్‌లో వివరాలు చెక్ చేసుకోవాలని సూచించారు.